ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిసర ప్రాంతాలలోని బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. అల్పపీడనం కారణంగా సముద్రం 30 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉండడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. జాలర్లను ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజలెవరు సముద్రంలో ఈతకు వెళ్ళవద్దని మెరైన్ పోలీసులు హెచ్చరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.