మనస్తాపంతో ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య
వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వృద్ధుడు మనస్తాపంతో గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా పక్షవాతంతో, అనారోగ్య సమస్యలతో మంచం పట్టిన అతను ఎవరు పటించుకోవడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.