TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.