సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 8-15 వరకు జరగనున్న ప్రజా పోరు, ప్రచార యాత్ర విజయవంతం చేయాలని పిలుస్తూ, పిడుగురాళ్లలో గురువారం కరపత్రాలు ఆవిష్కరించారు. సిపిఎం పిడుగురాళ్ల మండల కన్వీనర్ తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించిందని, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని, జెమినీ ఎన్నికల ప్రతిపాదన విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.