గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం"డయల్ యువర్ కమిషనర్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 25 ఫిర్యాదులు అందాయి. డయల్ యువర్ కమిషనర్ కి వచ్చిన ఫిర్యాదులను విభాగాధిపతులు నేరుగా సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపాలని కమిషనర్ చెప్పారు. ఆర్జీల పరిష్కార పురోగతి పై ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తామని అన్నారు.