జీఎంసి పరిధిలో రోడ్లు, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా జరుగుతుందని, ఆక్రమణదార్లు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. గురువారం గుంటూరు పట్టణ ప్రణాళిక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో ఆక్రమణల తొలగింపుపై కమిషనర్ మాట్లాడారు. అమరావతి రోడ్, గోరంట్ల మెయిన్ రోడ్, జీటీ రోడ్, నల్లపాడు రోడ్లలో ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. తిరిగి ఆక్రమణలు చేస్తే చర్యలు తప్పవన్నారు.