విద్యార్థిని విద్యార్థులు నిర్దేశించిన తేదీలోగా పది పరీక్ష ఫీజు చెల్లించాలని డిఈఓ సివి రేణుక గురువారం తెలిపారు. ఈనెల 18 వరకు ఎటువంటి అపరాధ రసుము లేదని తెలిపారు. అన్ని సబ్జెక్టులకు రూ. 125 చెల్లించాలని, మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉంటే రూ. 110 హెచ్ఎంలకు చెల్లించాలన్నారు. ఇతర వివరాల కోసం పాఠశాలలో హెచ్ఎంలను సంప్రదించాలని నూచించారు.