కొరిశపాడు: క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ

59பார்த்தது
కొరిశపాడు: క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ
కొరిశపాడు మండలం మేదరమెట్ల ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిలారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని అన్నారు. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி