‘ఏపీ ఎస్కోబార్ వైఎస్ జగన్’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి పర్యటనలో ఆయన మాట్లాడారు. ‘‘గత 5 ఏళ్ళుగా నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని తాగేసాడు. మద్యం తయారీ అతనిదే, అమ్మేది కూడా అతనే. ఎస్కోబార్ కొలొంబోలో జరిగిన వాస్తవం. ఒక రౌడీ, నేరస్తుడు దేశాన్ని ఎలా అతలాకుతలం చేశాడో తెలుసుకుంటే ఏపీ ఎస్కోబార్ గురించి ఒక ఆలోచన వస్తుంది. రాజకీయ నాయకులు చాలా మంది వస్తుంటారు. ఇలాంటి వారు రాష్ట్రానికే అరిష్టం’’ అని సీఎం అన్నారు.