రాప్తాడు: ప్రజా రెవెన్యూ దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశం భవనంలో శుక్రవారం ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ప్రజా రెవెన్యూ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, బాధిత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేశ్, ఎంపీడీవో శివశంకరప్ప, తహశీల్దార్ సురేశ్, సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు.