ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో వైసీపీ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా వైయస్సార్ జిల్లాలో ప్రగతి పథంలో నడుస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించాలనుకోవడం సహేతుకం కాదని ఆవేదన వ్యక్తంచేశారు.