రైల్వే కోడూరు గ్రామీణ సర్కిల్ పరిధిలో టపాసులు విక్రయించే విక్రయదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో టపాసులు అమ్మకానికి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. అనుమతి పొందిన వారు మాత్రమే టపాసులు అమ్మాలని, అనుమతులు లేకుండా టపాసులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.