సిద్దవటం మండలం మాధవరం వన్ గ్రామంలో ఆదివారం ఉదయం ఎస్ ఎస్ ఈకో మోటర్ ద్విచక్ర వాహనాల అవగాహన సదస్సు జరిగింది. మేనేజర్ వెంకట్, సీఎం డి సంగీత మార్కెటింగ్ మేనేజర్ సహజ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రజలకు మరియు రైతులకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ పరిరక్షణలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. వాహనాలను సరిగ్గా ఎలా వినియోగించాలో, వాటి లాభాలు, పర్యావరణంపై ప్రభావం గురించి మాట్లాడారు.