రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట మినీ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల చేత పనులు చేయించడంపై అధికారులు విచారించి ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ మంచి చదువుల కోసం పిల్లలను పంపితే పాఠశాల వారు బాల కార్మికులుగా పని చేయిస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు..