జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి అలిరెడ్డి పల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోస్తారనగా తుఫాన్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. నెలకొరిగిన వరి నీటిపాలైంది. వరి కట్టలు కట్టిన ఉపయోగం లేకుండా పోయింది మోసులు రావడంతో పంట కోయడానికి కూడా అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.