సింహాద్రిపురం మండలం నంద్యాలం పల్లె గ్రామానికి చెందిన వై.వెంకట మహేశ్వర్ రెడ్డిపై శుక్రవారం రాత్రి దాడి చేసిన కేసులో 5 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ, ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు. శనివారం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.