బోయకొండలో గాలివీడుకు చెందిన సైనికుడు సురేష్ రెడ్డి పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ సైనికుల సంఘం మదనపల్లి అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ సైనికుడు సురేష్ రెడ్డి 15 సంవత్సరాలుగా లడ్డాక్ వద్ద విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.