యోగి వేమన విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర శాఖ పరిశోధకులు జి. ఈశ్వర రెడ్డికి బుధవారం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఆర్థిక శాస్త్ర శాఖ సహ ఆచార్యులు డా. తుమ్మలూరు సందర్శన రెడ్డి పర్యవేక్షణలో అగ్రికల్చర్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్: ఏ కేస్ ఆఫ్ రాయలసీమ రీజియన్" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కృష్ణారావు ప్రకటించారు.