కమలాపురం నగర పంచాయతీ ప్రజల నీటి కష్టాలను తొలగించడానికి నగర పంచాయతీలోని రాం నగర్ నుండి బీడీ కాలనీ వరకు, రాం నగర్ వీధులలో త్రాగునీటి పైప్ లైన్ పనులను గురువారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. 15 వ ఫైనాన్స్ మొదటి కోటా నిధుల ద్వారా రూ. 14 లక్షల వ్యయంతో తలపెట్టిన పనులకు పూజ నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు, తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.