చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సోమవారం ఉదయాన్నే 6 గం.లకు అవ్వాతాతలకు పెన్షన్లు 4000 పెంచి పంపిణీ చేయడం జరిగిందని జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా అన్నారు. గతంలో జగన్ రెడ్డి సంవత్సరానికి రూ. 250 పెంచుతూ పోతే ఈ రోజు చంద్రబాబు ఒకేసారి 1000 పెంచడమే కాకుండా గత 3 నెలలకు సంబందించిన రూ. 3000 కలిపి రూ. 7000 పంచుతున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి కుమ్మరి వీధిలో ఇంటింటికీ వెళ్లి ఖాదర్ పెన్షన్లు పంపిణీ చేశారు.