కమలాపురం మండలం గంగవరం నుండి చాపాడు లో లేవల్ రోడ్డు పడిపోయి సంవత్సరాలు గడిచిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ రావడం తాత్కాలికమైన రోడ్డు నిర్మించడం వెళ్లిపోవడం, ఆ రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడం ఇది యధావిధిగా జరిగే పరిస్థితి. గంగవరం గ్రామం నుండి విద్యార్థులు చాపాడు గ్రామానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు శాశ్వత రోడ్డు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.