అనంతపురం జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్
అనంతపురం జిల్లాలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పలు మండలాల్లో పాత నేరస్తులు, రౌడీషీటర్ల ఇళ్లల్లో, పశువుల పాకలు, గడ్డి వాముల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. మట్కా, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.