ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరగడంతో భారీ సంఖ్యలో ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సాప్ తెలిపింది. బల్క్, స్పామ్ మెసేజులు పంపడం, అక్రమ కార్యకలాపాలు, అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేస్తుంటుంది.