ఉరవకొండ: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
ఉరవకొండ మండలంలో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్-2025 కార్యక్రమంలో భాగంగా ఈనెల 9, 10, 23, 24 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ ఎస్. మహబూబ్ బాషా తెలిపారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం తేదీల్లో అన్ని పోలింగ్ బూత్‌లలో బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.