ఉరవకొండ పట్టణంలో ఉన్న బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎంపిడిఓ బి.వి. రవిచంద్ర, ప్రిన్సిపాల్ ఆర్.కె.ఎల్. జ్ఞానప్రసూన, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ తదితర నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆడుకోవడానికి వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, ఖోఖో కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.