ఉరవకొండ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అని జివిఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఈవో కార్యాలయం నందు శనివారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే. పురుషోత్తం మాట్లాడుతూ. విద్య హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యను గత ప్రభుత్వం అందించినది, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. వెంటనే స్పందించి ఉచిత విద్యను కల్పించే విధంగా కృషి చేయాలన్నారు.