తాడిపత్రి మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి మూలన పడేసిన పలు ఇనుప వస్తువులను గురువారం అరబిందో వాటర్ వార్క్స్ ఆవరణలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం వేశారు. 13.60 టన్నుల ఇనుప వస్తువులను వేలం వేయగా రూ. 7 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పురపాలక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ డీఈ రాంప్రసాద్, ఏఈ తేజ పాల్గొన్నారు.