పెనుకొండ మండలం గుట్టూరు కనుమ వద్ద బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి పట్ల మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సాయి భవితకు సంతాపం తెలిపారు. సాయి భవిత తండ్రి రొద్దం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఈటిగా పనిచేస్తున్నారు. రమేష్ తీవ్రంగా గాయపడగా వెంటనే కోలుకోవాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.