పెనుకొండ పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో బుధవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి కె. మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు షమీవుల్లా, భాస్కర్, ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయులు దాదు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన, వకృత్వపు, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.