కదిరి: తెలుగు వారి భవిష్యత్యే తెలుగుదేశం పార్టీ: ఎమ్మెల్యే
తెలుగు వారి భవిష్యత్యే తెలుగుదేశం పార్టీ అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కదిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్, నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు.