కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శ్రీవారి కోనేరు కాస్తా మురుగుతీర్ధం లాగా మారిపోయిందని జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల పేర్కొన్నారు. సోమవారం అయన మాట్లాడుతూ స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు కోనేరులో స్నానం ఆచరించి స్వామి వారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ గా వస్తోందని అభివృద్ది పేరుతో గత ప్రభుత్వం ఉన్న కోనేరును నాశనం చేసిందని తెలిపారు.