పామిడి పట్టణంలోని తగ్గు దేవాలయం దగ్గర గల అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం అడిషనల్ సిడిపిఓ నాగమణి తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని తెలిపారు.