గుంతకల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని జనసేన పార్టీ నాయకులు, బలిజ సంఘం అధ్యక్షులు పూలరమణ అన్నారు. ఈ మేరకు మంగళవారం డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి ఫ్లెక్సీలు చించివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.