ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రభుత్వ చవకధాన్యపు స్టాక్ యార్డ్ ను ఆర్డీవో మహేష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో ఉన్న చౌక ధాన్యపు గోడౌన్ లోని స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. బియ్యం ప్యాకెట్లను తూకం వేసి సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నిబంధనలు ప్రకారం రిజిస్టర్ నీ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.