ఇటీవల కురిసిన వర్షాలకు ధర్మవరం పట్టణంలోని చెరువుతోపాటు పోతుకుంట చెరువు కూడా పూర్తిగా నిండి మరువ పారు తున్నది. ఈ సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అక్కడికి చేరుకొని పూజలు నిర్వహించుకుంటూ, ఉల్లాసమైన సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగా పోతుకుంట చెరువు వద్దకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకం మధుసూదన్ రెడ్డి, ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ చెరువుకు ప్రత్యేక పూజలు చేసారు.