మహిళలకు దీపావళి కానుకగా నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేయనుండగా నేటి నుంచి బుకింగ్ ప్రక్రియ మొదలుకానుంది. తెల్లరేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 12, 08, 293 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.