టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన బుధవారం రాత్రి పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.