వజ్రకరూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం పౌష్టికాహారం మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలకు అవగాహన కల్పించారు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, మాంసకృతులు కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. పోషకాహార లోపం ఏర్పడితే రక్తహీనతకు దారితీస్తుంది అన్నారు.