రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వరదలను అంచనా వేయడంలో, బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. 100 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం బాధాకరమని అన్నారు.