కనుముక్కల: భర్త మృతి తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం
చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన పావని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె భర్త నేలకోటప్ప సుమారు 6 నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె తన ఇంటిలోనే హార్పిక్ (విషద్రావకం) తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి పావనిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.