నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరవకముందే శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో సినర్జీన్ యాక్టివ్ ఇన్ గ్రేడియట్స్ ఫార్మ కంపెనీలో రియాక్టర్ లీకైన ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కార్మికుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతుందన్న దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.