అన్ని ప్రభుత్వ/ప్రభుత్వేతర పాఠశాలలు, కళాశాలలతో సహా ఆగస్టు 26న రాష్ట్రవ్యాప్తంగా జన్మాష్టమిని జరుపుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత ఆరిఫ్ మసూద్ స్పందిస్తూ.. సంస్థలను నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఎందుకు నిమగ్నమైందో అర్థం కావడం లేదు అని అన్నారు. "జన్మాష్టమి విద్యాసంస్థలకు తప్పనిసరి చేస్తారు కానీ.. మద్రాసాల వైపు వేళ్లు చూపిస్తున్నారు" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు.