చీటీల పేరుతో రూ. 14 కోట్ల మోసం
పెందుర్తి, గాంధీనగర్ పరిసరప్రాంతాలలో చీటీల పేరుతో 540 మంది వద్ద నుంచి రూ. 14 కోట్ల మేర మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సివిల్ కాంట్రాక్టర్ సిల్లా ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి, ఆమె కుటుంబ సభ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బాధితులుకోరారు. విశాఖ ప్రెస్‌క్లబ్‌లో బాధితులు సోమవారం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మాధవి వద్ద చీటీలు కడితే మోసం చేసి పరారయ్యారన్నారు.