జీడీపిక్కలను ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని, జీడి తోటలకు ఈక్రాఫ్ నమోదు చేయాలని జీడికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాటిపర్తి పంచాయితీలో గిరిజనులు పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదానకార్యదర్శి డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ మాట్లాడారు.