విశాఖ జగదాంబ కూడలిలో గల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని విశాఖ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మ రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తికి , డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏవీవీ రాజు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని జీవీఎంసీ అధికారులు తొలగించారన్నారు.