మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాలలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నట్టు జివిఎంసి కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఆదివారం తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగానికి సంబంధించిన సమస్యలపై నగర ప్రజలు వినతి పత్రాలు ఇవ్వచ్చు అన్నారు.