విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం డాగ్ స్క్వాడ్ పనితీరుని పరిశీలించారు. శుక్రవారం నగరంలో ఆర్మడ్ రిజర్వు మైదానంలో పోలీస్ సిబ్బంది పరేడ్ ను పరిశీలించారు. సిబ్బంది చేసిన లాఠీ డ్రిల్ ఆర్మ్స్ అండ్ అసెంబ్లింగ్ ను పర్యవేక్షించారు. అత్యవసర సమయాల్లో గుంపులను చెదరగొట్టేందుకు వినియోగించే మల్టీ షెల్ లాంచర్, వజ్రా వాహనం ద్వారా వాడే మల్టీ బ్యారెల్ లాంచర్ ప్రయోగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.