విశాఖ 32వ వార్డు అల్లిపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను కార్పొరేటర్ కందుల నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 20 లక్షల వ్యయంతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వార్డులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.