రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రస్వామి, కళాశాల విద్యా కమిటీ చైర్మన్ వీరలక్ష్మి పాల్గొని భారత తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. విద్యార్థులు రేపటి నవతరంగా ఎదిగి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. విద్యార్థుల కల సాకారం కావాలన్నారు.