అనకాపల్లి: స్కూల్ బస్ ను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని తీసుకెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు ను నక్కపల్లి వద్ద ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. బాలాజీ మాట్లాడుతూ 40 మంది సామర్థ్యం గల బస్ లో 70 మంది వరకు విద్యార్థులను ఎక్కించి తీసుకెళ్లుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.